లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ శివారులో నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న స్థావరంపై గురువారం లక్షేట్టిపేట ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి దాడిచేయడం జరిగింది. ఈ దాడిలో రవి, కోట గౌరయ్య, మండే సత్తన్న, కొట్టే శ్రీనివాస్, వొళ్ళుపోజు మురళి, కోట రవీందర్ ఏడుగురిని పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 25,280/- రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. బాల్త శ్రీనివాస్, చింతకింది చిన్నయ్య, చాకలి సంతు, బొలిశెట్టి నరేష్, బొల్లం వెంకటేష్ ఐదుగురు పేకాటరాయుళ్లు పరార్ అయ్యారని ఎస్సై తెలిపారు.