calender_icon.png 26 February, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేస్తున్న నిందితుడి అరెస్ట్

25-02-2025 11:48:41 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): దుబాయ్, హైదరాబాద్‌లో ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేస్తున్న ఓ నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దర్మేందర్‌కుమార్ అలియాస్ రోమన్ అనే వ్యక్తి ఢిల్లీలో కాల్‌సెంటర్ నిర్వహిస్తున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. అంబర్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తికి గతేడాది జూలైలో గోటుకెరీర్ అనే వెబ్‌సైట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి హైదరాబాద్‌లోని ఆప్టమ్ అనే కంపెనీలో ఉద్యోగ అవకాశం ఉందని ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అందు కోసం రూ.15.88లక్షలను అంబర్‌పేట్ వాసి కాల్ చేసిన వ్యక్తి అకౌంట్లలోకి దశల వారీగా పంపాడు. అయినప్పటికీ ఉద్యోగం ఇవ్వకుండా సదరు వ్యక్తి బాదితుడిని మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు మోసపోయినట్లు భావించి పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి రెండు మొబైల్స్, రెండు ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.