26-02-2025 07:49:13 PM
భూపాలపల్లి జిల్లా డిఎస్పి సంపత్ రావు...
చిట్యాల: హత్య చేసి ఆభరణాలను అపహరించిన నిందితులను అరెస్టు చేసినట్లు భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో చిట్యాల సిఐ మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను డి.ఎస్.పి వెల్లడించారు. టేకుమట్ల మండలంలోని బోయినపల్లి గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ(70) సేకరించిన చింతపండును విక్రయించడానికి గరిమీళ్ళపల్లి గ్రామానికి వెళ్లి అదృశ్యమైంది. ఉదయాన్నే కుమారులు గమనించి పలు ప్రాంతాలను వెతక సాగారు. ఈ క్రమంలో పసిక మనమ్మకు చెందిన వ్యవసాయ బావిలో నుండి వాసన గమనించి చూడగా ఓ గుర్తు తెలియని బావిలో శవం నీటిపై తేలాడుతూ కనిపించింది.
దీంతో గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీసారు. కాగా మృతురాలిని హత్యకు గురైందని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఆధారంగా హత్య చేశారని గుర్తించి నిందితులను పట్టుకున్నట్లు డిఎస్పి తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రాలు చేస్తున్నారనే నెపంతో హత్య చేసిన బోయిని మల్లయ్య, పుట్టకొక్కుల శ్రీనివాస్, మద్దెల సిద్దు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. కాగా మృతురాలి దగ్గర ఉన్న బంగారం, వెండిని అపహరించినట్లు తెలిందన్నారు. ఈ సందర్భంగా టేకుమట్ల ఎస్.ఐ సుధాకర్, సిబ్బంది ఏఎస్ఐ అమరేందర్, రెడ్డి, రమేష్, మహేందర్, నాగరాజు, రంజిత్ సతీష్ లను డి.ఎస్.పి అభినందించారు.