calender_icon.png 24 December, 2024 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్జే శేఖర్‌బాషా అరెస్ట్

19-10-2024 01:04:06 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 18: బిగ్‌బాస్ కంటెస్టెంట్, ప్రముఖ ఆర్జే శేఖర్ బాషాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతను హర్షసాయికి అనుకూలంగా, తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచా రం చేస్తున్నాడని యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, హర్షసాయి తన ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అదేవిధంగా డబ్బులు కూడా తీసుకున్నాడని కొన్నిరోజుల క్రితం ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.