calender_icon.png 4 February, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచుల సంఘం అధ్యక్షుని అరెస్ట్..

04-02-2025 07:53:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): గ్రామపంచాయతీలో పెండింగ్లో ఉన్న సర్పంచుల బిల్లులను విడుదల చేయాలని కోరుతూ సర్పంచ్ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్ జిల్లాలో పలువురు సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. సోన్ మండల కేంద్రంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు టి వినోద్ కుమార్ ను మల్లేష్ యాదవ్ నరసాపూర్లో రామ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేశారు. ప్రభుత్వం తమను అరెస్టు చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని సర్పంచులు పేర్కొన్నారు.