రూ. 41 వేల నగదు స్వాధీనం, 6 గురు అరెస్ట్....
పెద్దపెల్లి (విజయక్రాంతి): కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి ఎస్ఐ వెంకటేష్ పేకాట ఆడుతున్న పలువురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం... ఆరుగురు వ్యక్తులను పట్టుకోగ, మిగతావారు పారిపోయారన్నారు. వారిని విచారించగా మున్నాం శంకర్ బాలాజీ, 8 ఇంక్లైన్ కాలనీ గోదావరిఖని, రామగిరి మండలం నాగేపల్లికి చెందిన బొల్లంపెళ్లి రాజు, పుట్ట కార్తీక్, మంథని మండలంలోని ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన నస్కూరి సందీప్, ముడుసు రాజు, నారగోని శ్రీనివాస్ కూనరం గ్రామానికి చెందినవారు ఉన్నారని, వారి వద్ద రూ. 41,670/- రూపాయలను, పేకాట ముక్కలను, 7 మొబైల్ ఫోన్స్, 3 మోటార్ సైకిల్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్స్ లక్ష్మన్, రవి, శ్రీరాజ్, వినుస్టర్ పాల్గొన్నారు.