30-04-2025 12:46:34 AM
ఆర్మూర్, ఏప్రిల్ 29: అర్మూర్ పట్టణ శివారులో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను అదు పులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ సిఐ రవి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు.
ఈ దాడిలో ఏసుగురిని అదుపులోకి తీసుకున్నారు. గడ్డం మల్లారెడ్డి, ఉట్నూరు వెంకటేష్, మజ్జరి రా మకృష్ణ, ఇట్టేడి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం నారాయణ, నూతుల అశోక్ రెడ్డి, లోక సూర్య ప్రకాష్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2,56,830 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పే ద్వారా ఆడిన బెట్టింగ్ నగదు 2 లక్షల 35 వేలు, 21,830 స్వాధీనం చేసుకున్నారు.