06-03-2025 08:47:49 PM
బైంసా (విజయక్రాంతి): బైంసా మండలంలోని వట్టోరి శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకున్నట్టు బైంసా పోలీసులు తెలిపారు. గురువారం పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో బ్లూ కోర్టు సిబ్బంది అక్కడికి వెళ్లి ముగ్గురిని పట్టుకొని 3500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వివరించారు.