ముషీరాబాద్, జనవరి 22 : ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం గంజాయి విక్రయాలు చేపడుతున్న ఇద్దరిని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నిందితులు జార్ఖండ్‌కు చెందిన గుడ్డు కుమార్, సంతుకుమార్‌గా తేలింది. 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.