కామారెడ్డి (విజయక్రాంతి): బాసర త్రిబుల్ ఐటీలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలపై వెళ్లిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు అకారణంగా దాడి చేసి గాయపరిచినందుకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో త్రిబుల్ ఐటీ కళాశాల ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో శనివారం కామారెడ్డి నుంచి ఏబీవీపీ విద్యార్థులు తరలివెళ్లారు. కామారెడ్డి ఏబీవీపీ నేతలు రోహిత్ ఆధ్వర్యంలో త్రిబుల్ ఐటీ క్యాంపస్ కు ముట్టడించేందుకు వెళ్లిన నేతలను అర కిలోమీటర్ దూరంలోనే పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్ట్ అయిన వారిలో కామారెడ్డి ఏబీవీపీ నేతలు శివ మోహన్ రోహిత్ లను అరెస్టు చేసి బాసర పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు త్రిబుల్ ఐటీకి వెళ్లిన ఏబీవీపీ విద్యార్థులను అనవసరంగా అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వం త్రిబుల్ ఐటీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడుగడుగున విద్యార్థి నేతలను అరెస్టు చేశారన్నారు. త్రిబుల్ ఐటీలో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.