బైంసా (విజయక్రాంతి): ధర్మాబాద్ నుంచి లారీలో తరలిస్తూ పట్టుబడింది పీడీఎస్ బియ్యమేనని సివిల్ సప్లయ్ శాఖ టాస్క్‌ఫోర్స్ రాష్ట్ర బృందం అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి పట్టణంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఉంచిన పట్టుబడిన బియ్యంను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్మాబాద్ నుంచి గోండియాకు తరలిస్తున్నట్లు చెబుతున్న మాట అవాస్తవమని, పట్టుబడిన బియ్యంలో ఎఫ్‌ఆర్‌కె(ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్స్) ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసు శాఖ విచారణ జరుపుతోందని, తాము సైతం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పీడీఎస్ బియ్యం, సీఎంఆర్ ధాన్యం అక్రమంగా తరలిస్తే తమకు సమాచారమివ్వాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్ బృందంలో ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ శేఖర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు తదితరులున్నారు. వారి వెంట డీసీఎస్‌వో కిరణ్‌కుమార్, డీటీ ప్రకాశ్, ఎంఎల్‌ఎస్ పాయింట్ డీటీ బాపురావు ఉన్నారు.