calender_icon.png 10 January, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యుని అరెస్ట్.. రిమాండ్

09-01-2025 06:22:27 PM

నకిలీ వైద్యున్ని గుట్టు రట్టు చేసిన కామారెడ్డి పోలీసులు...

కామారెడ్డి (విజయక్రాంతి): నకిలీ వైద్యున్ని ఆగడాలను కామారెడ్డి పోలీసులు గుట్టు రట్టు చేశారు. కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స వివరాలు తెలుసుకుని కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో వైద్యుడిగా చలామణి అవుతున్న వ్యక్తిని కామారెడ్డి పోలీసులు గుట్టురట్టు చేశారు. కామారెడ్డి పోలీసులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. గురువారం కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నకిలీ వైద్యుని వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపుర్ గ్రామానికి చెందిన ముల్కల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. అయితే డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స నేర్చుకున్నాడు. తన పేరును రవీందర్ రెడ్డిగా ఫోటో షాప్ లో ఆధార్ కార్డు, నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి ఫోటో మార్పు చేసుకున్నాడు.

ఫేక్ సర్టిఫికెట్తో కామారెడ్డి స్టార్ హాస్పిటల్లో, ఆరోగ్య ఆస్పత్రిలో, లింగంపేట భీమరాజు ఆస్పత్రిలో ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ మెడిసిన్, పిల్లల వైద్యుడిగా కొనసాగాడు. ఖానాపూర్ లోని షణ్ముఖ ఆస్పత్రిలో పిల్లల వైద్యుడిగా పని చేయడానికి ఈనెల 6న అడ్వాన్స్ గా రూ.2 లక్షలు తీసుకున్నాడు. అయితే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు రవీందర్ రెడ్డిని పట్టుకుని విచారించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి ఫేక్ ఆధార్ కార్డు, సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో హాజరు పరుస్తామని ఏఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ, రూరల్ సీఐలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్, కామారెడ్డి సీసీఎస్ సీఐ శ్రీనివాస్, కామారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు శ్రీరామ్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.