02-04-2025 12:00:00 AM
మహబూబాబాద్. ఏప్రిల్ 1: (విజయ కాంతి)హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్ సి యు) పరిసర ప్రాంతాల్లో వందలాది చెట్లు నరికివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని, బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ గారిని, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారిని మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గార్లను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ కేసముద్రం మండల శాఖ తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనంగా నిలుస్తూ మరో అత్యవసర పరిస్థితి తలపిస్తు ఈ విద్వాంసంలో జాతీయ పక్షులు,అనేక వణ్యప్రాణులు బలవడమే కాకుండ, చెట్లు నరికేస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తూ, ప్రశ్నించేవారిని గృహ నిర్బంధం చేస్తున్న కాంగ్రెస్ వైఖరి ఎమర్జెన్సీ చీకటి రోజులని గుర్తు చేస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని బిజేపి మండల శాఖ డిమాండ్ చేశారు