24-03-2025 05:45:15 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): అసెంబ్లీ ముట్టడికి ఆశ యూనియన్ పిలుపునివ్వగా హైదరాబాద్ కు వెళ్లకుండా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆశా కార్యకర్తలను సోమవారం తెల్లవారుజామున అడ్డుకొని హుజురాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల యూనియన్ ఉపాధ్యక్షురాలు కాలేశ్వరపు పుష్పలత మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
కనీస వేతనం 18 వేల రూపాయలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశ వర్కర్లకు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి హెల్త్ కార్డులు అందించాలని కోరారు. అరెస్టైన వారిలో కాళేశ్వరపు పుష్పలత, తునికి విమల, కవిత, కొక్కుల సునీత, స్వరూప, శారదాతో పాటు తదితరులు పాల్గొన్నారు.