calender_icon.png 26 March, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్ అక్రమం..

22-03-2025 10:06:59 PM

ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారాం..

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర విద్యారంగానికి 30% నిధులు కేటాయించాల్సి ఉండగా, కేవలం అత్యల్పంగా 7.5% నిధులు మాత్రమే కేటాయించి చేతులు జరుపుకోవాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారంచలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ముందస్తుగా అరెస్టు చేయడానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారామ్ తీవ్రంగా ఖండించారు.

శనివారం మండల కేంద్రంలోని స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకుల్ని చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్తున్నారన్నా సమాచారంతో స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్, ట్రైనీ ఎస్సై గోపాల్ రెడ్డి తన సిబ్బందితో ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించగా, స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏఐఎస్ఎఫ్ నాయకులకు సీతారాం సంఘీభావం తెలియజేసిన అనంతరం మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్న చేతలు మాత్రం గడపకూడా దాటడం లేదని, ఊకదంపుడు ఉచిత ఉపన్యాసాలు తప్ప రాష్ట్ర విద్యార్థి లోకానికి ఒరిగిందేమీ లేదన్నారు.

రాష్ట్ర విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ఏ రకంగా కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తారని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు, విద్యార్థి ఉద్యమాలన్న, ప్రజా పోరాటాలు అన్నా రేవంత్ రెడ్డికి భయమని అందుకే రేవంత్ రెడ్డి ఉద్యమాలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ముందస్తుగానే పోలీసులని ఉపయోగించి అరెస్టు చేస్తున్నారని, అయినా విద్యార్థి ఉద్యమాలను ఏ పోలీసులు లాఠీలు అరెస్టులు కేసులు భయపెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గోరి కట్టేది విద్యార్థులే అని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు, అరెస్ట్ అయిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు ఎస్కే ముస్తఫా, కార్యదర్శి జి బుచ్చిబాబు, రుద్ర యశ్వంత్ తదితరులు ఉన్నారు.