calender_icon.png 22 November, 2024 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్టు

22-11-2024 12:58:19 PM

1 కిలో 232 గ్రామ్స్ ల గంజాయి స్వాధీనం 

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్టు  చేసినట్లు మంథని సీఐ రాజు తెలిపారు. మంథని సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రమేష్ తో కలిసి సీఐ మాట్లాడుతూ.. మంథనిలో నిషేధిత గంజాయి అక్రమంగా కల్గి ఉన్నారని సమాచారం రాగా ఎస్ఐ ఆదేశాలతో సిబ్బంది దుబాసి.రమేష్, సంతోష్ కుమార్, వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్ లతో కలిసి వెళ్లగా కుచిరాజ్ పల్లి గ్రామ శివారులో గల బాలాజీ రియల్ ఎస్టేట్ ప్లాట్ నందు, గెస్ట్ హౌస్ వద్ద అనుమానాస్పదంగా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదముగా చేతిలో నీలం రంగు కవర్ తో కనిపించగా ఆ వ్యక్తులను పోలీస్ లను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని పట్టుకొని కవర్ లో ఎమి ఉందని అడుగగా అందులో ఎండిపోయిన మొగ్గలు, పువ్వులు గల గంజాయి ఉన్నదని తెలిసిన, వెంటనే వారిని అదుపులోకి తీసుకోని పంచుల సమక్షంలో విచారించి అరెస్టు చేశామని సీఐ తెలిపారు. మంథనిలో అక్రమ దందాలు చేస్తే సహించేది లేదని,  వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.