05-04-2025 04:22:08 PM
ఆదివారం 11.59 కీ మహుర్తం
ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 11.59 గంటలకు పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నసుముహూర్తం నా జరుగనున్న కళ్యాణ వేడుకకు వేలాదిగా భక్తులు జిల్లా కేంద్రంలోని జనకాపూర్ గ్రామంలో గల కోదండ రామాలయానికి తరలి రానున్నారు. గత మూడు రోజులుగా ఆలయం వద్ద నిర్వాహకులు కళ్యాణ వేడుకకు సంబంధించిన పనులను ముమ్మరంగా చేపడుతున్నారు.
శనివారం ఆలయం వద్ద పందిర్లు వేసి పాలకొరక కార్యక్రమం చేపట్టారు. కోదండ రామాలయంలోని శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమాన్ సమేతంగా ఉన్న గర్భగుడితోపాటు శివాలయం సాయి మందిరాన్ని పూలతో అత్యంత వైభవంగా అలంకరించారు. దీంతోపాటు ఆలయం ఆవరణలో నీ కళ్యాణ మండపాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవతో కార్యక్రమాలను మొదలు పెట్టడం జరుగుతుందని ఆలయ అర్చకుడు వినాయక శర్మ తెలిపారు.