03-04-2025 01:21:33 AM
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్
భద్రాచలం ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నం దున, వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని శాఖల అధికారులు అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ అన్నారు.
బుధవారం భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు విజయవంతం చేయటానికి సంబంధిత శాఖల ద్వారా చేపట్టిన ఏర్పాట్లపై శాఖల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వైభవోపేతంగా ఎక్కడా లేని విధంగా సీతారాముల వారి కళ్యాణం జరిగేటువంటి పవిత్ర స్థలం మన భద్రాచలం పుణ్యక్షేత్రమన్నారు.
ఈ క్షేత్రంలో కొన్ని దశాబ్దాల తరబడి సీతారాముల వారి కళ్యాణం ఆనవాయితీగా జరుగుతున్నదన్నారు.కళ్యాణమహోత్సవాన్ని ప్రత్యే కంగా కానీ పరోక్షంగా వీక్షించిన భక్తులకు ఎంతో పుణ్యం వస్తుందని వేదాల్లో చెప్పడం జరిగిందని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంచినీరు, చలువ పందిళ్లు, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాగ్ లిస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులు కళ్యాణ వేడుకలు వీక్షించేందుకు 26 సెక్టార్లు ఏర్పాటుతో పాటు ప్రతి సెక్టార్ లో ఎల్ ఈ డి టివిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేడుకలకు విచ్చేయు భక్తులకు స్వామి వారి కళ్యాణ వేడుకలు వీక్షించి జన్మ జన్మల పుణ్యాన్ని పొందేలా అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరిం చుకొని దేవస్థానం తరపున మార్చి 30 నుండి ఏప్రిల్ 12 వ తారీకు వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయని, కళ్యా ణం జరిగే ముందు రోజు స్వామివారి ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుందని, భక్తుల సౌకర్యార్థం 75% ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచామని, భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు మహా ప్రసాదం కూడా అందించడానికి ప్రణాళికలు రూపొందించామని అన్నారు.
సీఎం రాక కోసం మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, కళ్యాణం మరియు పట్టాభిషేకం జరిగే రెండు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసి వేణుగోపాల్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీవో దామోదర్ రావు, దేవస్థానం ఈవో రమాదేవి మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.