calender_icon.png 25 February, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు

25-02-2025 05:26:34 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

వాంకిడి (విజయక్రాంతి): మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... పోలింగ్ రోజున ఓటర్ల సౌకర్యం కొరకు పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, షామియానా, మూత్రశాలలు, వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ రియాజ్ అలీని ఆదేశించారు.

దివ్యాంగ ఓటర్ల కొరకు వీల్ చైర్, ర్యాంప్ ఏర్పాట్లు చేయాలని, ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల కొరకు పోలింగ్ కేంద్రంలో వేరువేరుగా కంపార్ట్మెంట్లు ఉన్నందున ఆయా గదులలో వెలుతురు ఉండేలా చూడాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసే విధంగా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సి.ఐ.ఎస్.ఐ., పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.