25-02-2025 10:48:23 PM
ఏఎస్పి చిత్తరంజన్...
వాంకిడి (విజయక్రాంతి): భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఏ.ఎస్.పి చిత్తరంజన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శివాలయం జాతరలో ఏర్పాట్లను స్థానిక సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రశాంత్, ఆలయ కమిటీ సభ్యుడు గాదే ప్రవీణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లతో పాటు జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.