కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ఆదివాసీల నాగోబా జాతర నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. త్వరలో జాతర నిర్వహిం చనున్న నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా తదితరులతో కలిసి ఆయన గురువారం సందరించారు. ముందుగా నాగోబాకు అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత దర్బార్‌హాల్‌లో జాతర కో కమిటీ సభ్యులతో ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో తిరుగుతూ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.