calender_icon.png 1 March, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

28-02-2025 08:07:22 PM

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఆదేశాలు..

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు..

మార్చి 5 వ తేదీ నుండి  మార్చ్ 25 వరకు ఇంటర్ పరీక్షలు..

మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు జరగనున్న  పదవ తరగతి పరీక్షలు..

సంగారెడ్డి (విజయక్రాంతి): ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి  కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు చూసిరాత మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు 54 పరీక్ష కేంద్రాలు, పదో తరగతి పరీక్షలు 122 పరీక్ష కేంద్రాలల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించాలని, పరీక్ష కేంద్రాలలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులకు ఆదేశించారు.

పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 22423 మంది విద్యార్థులు హాజరుతున్నారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో పరీక్షలకు 15వేల 984 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలకు 1681 మొత్తం 17665 మంది విద్యార్థులు, మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నట్లు, ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 17,057, ఒకేషనల్ పరీక్షలకు 1431 మొత్తం 18488 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలవకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల సమయానికి అనుకూలంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు నడిపించాలని అధికారులకు సూచించారు. ఇంటర్ పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అత్యవసర మందులను పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమి కూడకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ పరీక్షా సమయాలు అమలులో పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని పోలీస్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల తరలింపు పరీక్ష నిర్వహణ తర్వాత పరీక్షా కేంద్రాల నుండి పోస్ట్ ఆఫీస్ లకు జవాబు పత్రాల తరలింపుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పోలీసు బందోబస్తు నడుమ ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల తరలింపు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్స్, డిపార్టుమెంట్ అధికారులతో పాటు, ఫ్లయింగ్ స్క్యాడ్, జిల్లా అధికారులు పరీక్ష‌ కేంద్రాలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవ్ రావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డిఆర్ఓ పద్మజ రాణి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.