మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్‌సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): చెరువుల వద్ద గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం కూకట్‌పల్లిలో ఆమె పర్యటించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున కూకట్‌పల్లిలోని పలు చెరువులు, బేబీ పాండ్ల వద్ద ఏర్పాట్లను, కేపీహెచ్‌బీలోని ఓపెన్ జిమ్, బాక్స్ కల్వర్ట్ నిర్మాణ పనులను ఆమె జోనల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. బేబీపాండ్స్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనకు పోలీసు, విద్యుత్‌శాఖ అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.