25-12-2024 01:50:10 AM
జనవరి 10 నుంచి కొత్తకొండ వీరభద్రుడి జాతర
భీమదేవరపల్లి, డిసెంబరు 24: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తకొండ జాతర జనవరి 10 నుంచి 18 వరకు జరుగుతుందని ఆమె తెలిపారు. మంగళవారం వీరభద్రుడి ఆలయ ఆవరణలో ఈవో కిషన్‌రావు ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జాత్త్రలు తీసుకోవాలన్నారు. భక్తుల కోసం 250 బస్సులను ఐదు డిపోల నుంచి సమకూరుస్తున్నట్లు ఆర్‌ఎం వివరించారు. జాతరలో వైద్య సహాయ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు ముల్కనూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రదీప్‌రెడ్డి, డీఎంహెచ్‌వో కలెక్టర్‌కు తెలిపారు.