calender_icon.png 12 May, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ రజతోత్సవ ముస్తాబు

25-04-2025 12:21:07 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ఈనెల 27న ఘనంగా నిర్వహించడానికి ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఎలకతుర్తి లో నిర్వహించనున్న రజతోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే రజతోత్సవ వేడుకకు వెళ్లడానికి ముందు గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని అనంతరం బయలుదేరాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ ఆదేశానుసారం జిల్లా, మండల, గ్రామస్థాయిలో పార్టీ జెండా గద్దెలకు గులాబీ రంగు వేసి ముస్తాబు చేస్తున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాలకు రంగులు వేయిస్తూ ముస్తాబు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు మహబూబ్ పాషా జండా గద్దె, తెలంగాణ తల్లి విగ్రహాలను శుభ్రం చేసి రంగులు వేయిస్తున్నారు.