19-02-2025 01:26:51 AM
*జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): నారాయణపేటలో ఈనెల 21న వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థా పనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్నా రని, సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మం గళవారం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల మెడికల్ కళాశాలలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ యో గేష్ గౌతమ్ తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు.
ఈనెల 21న మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వ ద్దకు చేరుకుంటారని, అక్కడి నుంచి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన పెట్రోల్ బంక్ ను ముఖ్యమంత్రి ప్రారం భిస్తారని, అలాగే జిల్లా మహిళా సమాఖ్య భావన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అనంతరం అప్పక్ పల్లి వద్ద గల మెడికల్ కళాశాలలో వంద పడకల ఎంసిహె (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగంతో పాటు నర్సిం గ్ కళాశాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలు శంకుస్థాపనలు చేస్తారని, అభి వృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల తర్వాత కళాశాల ముందు భాగంలో ఏర్పాటుచేసే పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారని, తిరిగి సాయం త్రం ముఖ్యమంత్రి హైదరాబాద్ బయలు దేరతారని కలెక్టర్ తెలిపారు.
అయితే ముఖ్య మంత్రి సింగారం చౌరస్తా నుంచి మెడికల్ కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారం భోత్సవాల ఏర్పాట్లను ఆయా శాఖల అధి కారులు దగ్గరుండి పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. సింగారం నుంచి అప్పక్ పల్లి వరకు రోడ్డుతో పాటు ఇరువైపులా స్థలాన్ని శుభ్రంగా మార్చాలని తెలిపారు. ముఖ్య మంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొనే వివిఐపీలకు అన్ని వసతులను సమకూ ర్చాలని, మధ్యాహ్న భోజనం మెడికల్ కళా శాలలోనే ఏర్పాటు చేయాలని, భోజనాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించాలని ఆమె చెప్పా రు.
ముఖ్యమంత్రి నారాయణపేటకు చేరుకు న్న మొదలు నుంచి తిరిగి వెళ్లే వరకు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్ర త్తలు తీసుకోవాలనీ, ఎవరెవరికి ఏఏ బాధ్య తలు అప్పగించారో వారు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు. శాఖల వారీగా అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతలను కలెక్టర్ చదివి వినిపించారు. పబ్లిక్ మీటింగ్ కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాల న్నారు.
వేసవికాలం మొదలైందని, మీటింగ్ కు వచ్చే జనాలకు తాగునీటి వసతి పై ప్రత్యే క దృష్టి సారించాలని చెప్పారు. డిఆర్డిఏ, టీజీ ఎమ్‌ఐడిసి, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నా యని ఆయా శాఖల అధికారులు ప్రోటోకా ల్ పాటించాలని సూచించారు. ఎస్పీ యోగే ష్ గౌతమ్ మాట్లాడుతూ పోలీసు శాఖ పరంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబం ధించిన అన్ని ఏర్పాట్లను, ముఖ్యంగా పటిష్ట భద్రత ఏర్పాట్లను చేస్తామన్నారు.
కార్యక్ర మంలో ఆర్డిఓ రామ్ చందర్ నాయక్, మెడి కల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, టీజీఎమ్‌ఐడిసి ఈ ఈ సురేందర్ రెడ్డి, ఎస్. ఈ జైపాల్ రెడ్డి, ఆర్టీవో మేఘా గాంధీ, డీఎ స్పీ నల్లపు లింగయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహాసి ల్దారులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్. పి. యోగేష్ గౌతమ్ సింగారం చౌరస్తాలో గల పెట్రోల్ బంక్, జిల్లా మహిళా సమాఖ్య భవ న నిర్మాణ స్థలాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.