25-02-2025 12:00:00 AM
ప్రకృతి సోయగాల నడుమ పురాతన ఆలయం
కల్లూరు, ఫిబ్రవరి 24 : తల్లాడ అటవీ రేంజ్ పరిధి పెనుబల్లి మండలానికి 10 కిలో మీటర్లు దూరంలో ఉన్న తాళ్లపెంట గ్రామ పంచాయితీ మీదుగా రిజర్వ్ పారెస్ట్‌లో సుమారుగా 25 కిలోమీటర్లు ఎత్తన కొండల పైన కాకతీయుల కాలం నాటి వీరబద్ర స్వామి గుడిలో జాతరకు సర్వం సిద్దమైంది.
ఇక్కడ నిత్యం నీటితో కళకళ లాడే పల్లెర్ల బావికి ఎంతో ప్రాముఖ్యత ఉందిఈ కనక గిరి ఫారెస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లా డ అటవీ రేంజ్ పరిధిలో ఉన్నది ఇందులో కల్లూరు, పెనుబల్లి, చడ్రుగొండ, జూలూరు పాడు, ఏనుకూరు మండలాల పరిధిలో సుమారుగా 14వేల 300 హెక్టార్ల లో ఈ ఫారెస్ట్ విస్తరించి వుంది. కొండపైన 530 మీటర్ల ఎత్తులో వున్న రాతిలో ఉన్నా శాశ్వత వనరుగా నిత్యం నీరు ఉండే పల్లెర్ల బావి ఇక్కడ విశేషం.
ఈ బావిలో మండు వేసవిలో కూడా సంవృద్ధి గా నీరు ఉంటుంది.చుట్టూ ఎత్తున కొండలు దట్టమైన అడవి ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణం జలజల పారే జలపాతాలు, పక్షులు కిలకిల రాగాలు పకృ తి సోయగాలతో తల్లాడ మండలం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కనకగిరి ఫారెస్ట్‌లో సోయగాల నడుమ వీరభద్ర స్వామి ఆల యం మహాశివరాత్రి పురస్కరించుకొని మూడు రోజులు పాటు అభయ అరణ్యం లో మహా శివుని కాలాణ్యం కనుల పండుగ జాతర మహోత్సవాలకు ముస్తాబు అవుతూ భక్తులకు ఆహ్వానం పలుకుతుంది.
కాకతీయ కాలం నాటి రాతి కట్టడాలు వన్య ప్రాణులు, ఎంతో చారిత్రాత్మక కట్టడాలు,ఆకుపచ్చని కొండలతో ఆకాశాన్ని తాకుతున్నాయా అని తలపించే ఎత్తయిన కొండలు. కాకతీయుల కాలం నాటి కళ కండాలు, కాకతీయుల కాలం నాటి కట్టడాలు ఈ కనక గిరి పారెస్ట్‌లోని విశేషాలు. ఇక్కడ వెంచేసిన విరభద్ర స్వామి గుడి ప్రత్యేకతలు కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడుగా పేరు గాంచిన విరభద్రుని గుడి కాకతీయుల కాలం నాటి గుడిగా పేరొందినది.
ఈ విరభద్ర స్వామి గుడికి వెళ్ళాలి అంటే ఎత్తన మూడు కొండలు పైకి కాలి నడకన లేదా జీప్ ద్వారా కానీ చేరుకోవచ్చు. సుమారుగా ఈ గుడి సుమారుగా 40 ఎకరాలు పారెస్ట్ పరిధిలో ఉంటుంది.
సుమారుగా 55 గుట్టలు కలిగిన ఈ కనక గీరి గుట్టలు కాకతీయ కాలం నాటి సిదిలమైన కొటలు, ద్వారాలు, రాతి కట్టడాలు, పారెస్ట్ వారు ఏర్పాటు చేసిన టవర్ పాయింట్ ఎక్కి చుస్తే పకృతి సోయగాలు కనకగిరి గుట్టల లో దర్శనం ఇస్తాయి పకృతి ప్రేమికులకు ఆహ్లాదకరన్నిస్తాయి.పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూరుతుంది.