calender_icon.png 22 February, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదు

21-02-2025 11:02:29 AM

ఆంధ్రప్రదేశ్  దేవాదాయ శాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్

 నాగర్ కర్నూల్, విజయక్రాంతి: శ్రీశైల మహా క్షేత్రంలో 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో(Mahashivratri Brahmotsavam) అశేషంగా భక్తులు హాజరుకానున్నారని శ్రీశైల క్షేత్రంలో భక్తులకు ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ అన్నారు గురువారం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం(Srisaila Mallikarjuna Swamy Temple)లో భక్తుల క్యూ లైన్లు సర్వదర్శనం, శీఘ్ర, అతిశీఘ్రదర్శన, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తుల రద్దీకి తగినట్లుగా ఆయా ఏర్పాట్లు ఉండాలని క్యూలైన్ల నిర్వహణ ప్రణాళికబద్దంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం క్యూలైన్ల నిర్వహణను పరిశీలిస్తుండాలన్నారు. క్యూకాంప్లెక్స్లో వేచివుండే భక్తులకు మంచినీరు. అల్పాహారం, బిస్కెట్లు క్రమం తప్పకుండా అందిస్తుండాలన్నారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాటలకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రథమచికిత్స కేంద్రం వద్ద నిరంతరం వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

జేబు దొంగల పట్ల భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీసీ పర్యవేక్షణ కూడా పటిష్ట పరచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవిధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. ముఖ్యంగా చెత్తచెదారాలు ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. అవసరమైన అన్నిచోట్ల కూడా సమాచారబోర్డులు. సూచికబోర్డులు అధిక సంఖ్యలో ఉండాలన్నారు.వారితో పాటు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.