calender_icon.png 26 February, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణానికి ఏర్పాట్లు

26-02-2025 12:16:44 AM

ముస్తాబవుతున్న రోడ్లు పరిశీలించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

వైరా, ఫిబ్రవరి 25 :  వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురం  మహాశివరాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే జాతరకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.. వైరా సాయిబాబా టెంపుల్ పక్క నుంచి స్నానాల లక్ష్మిపురానికి ఏర్పాటుచేసిన రోడ్డును  ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరిశీలించి ఇరువైపులా  రోడ్ సైడ్ వైన్డింగ్ చేసి దుబ్బ లేవకుండా క్యూరింగ్ చేయాలని, అంతేకాకుండా జాతర వద్దకు చేరుకునే   అన్ని రోడ్లను ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు, పోలీస్ అధికారులకు సూచించారు. 

వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, యడ్లపల్లి వీరయ్య చౌదరి, దొడ్డ పుల్లయ్య, వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, మరంపూడి మధు, పఠాన్ జాన్, ధరావత్ శంకర్ నాయక్,  తదితరులు ఆయన వెంట ఉన్నారు