జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జనవరి 21 : జనవరి 26న జిల్లాలో నిర్వహించబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 26వ తేదీన జిల్లాలో నిర్వహించబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గణతంత్ర వేడుకలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సందర్బంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు బాధ్యతలను అప్పగించారు. గణతంత్ర దినోత్సవం రోజున బందోబస్తు, ఫ్లాగ్ మార్చ్, ఓపెన్టాప్ జీప్ ఏర్పాట్లు జిల్లా పోలీస్ శాఖకు అప్పగించారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, ప్రోటోకాల్, ముఖ్య అతిథులకు ఆహ్వానం ఆర్డివో కు అప్పగించారు. భారీకేడింగ్, స్టాల్స్, డయాస్ ఏర్పాట్లను రోడ్లు భవనాల శాఖకు అప్పగిం చారు.
వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శకటాల ప్రదర్శన ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా స్టాల్స్ ఏర్పాట్లు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జెడ్పి సీఈఓ యాదయ్య, ఏమో భాను ప్రకాష్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఇతర ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.