పకడ్బందీగా చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జనవరి 24 ( విజయక్రాంతి ) : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.జనవరి 26న ప్రభుత్వ పాలిటెక్నిక్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న గణతంత్ర వేడుకలను శుక్రవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.ఎస్పీ వేంకటేశ్వర రావు తో కలిసి స్టల పరిశీలన చేశారు.
కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే అతిథులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు కూర్చోడానికి సరైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలిక వైద్య శిబిరం, తాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
వేదిక ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పై స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదన కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి వెంకటేశ్వరరావు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఏవో భాను ప్రకాష్, స్థానిక తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.