calender_icon.png 26 March, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ పండుగకు విస్తృత ఏర్పాట్లు: ఎమ్మెల్యే కూనంనేని

24-03-2025 12:36:54 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): రంజాన్ పండుగ(Ramadan Festival) సందర్బంగా బస్తీలు, గ్రామాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని, కొత్తగూడెం నియోజకవర్గ(Kothagudem Constituency) శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో అయన సోమవారం మున్సిపల్, పొలిసు, పంచాయతి రాజ్ శాఖల సబ్ డివిజన్, మండల స్థాయి అధికారులకు సోమవారం ఫోన్ చేసి పలు పనులపై ఆరాదిశారు అనంతరం కొన్ని సూచనలు చేశారు.

ఉపవాస దీక్షలు, రంజాన్ పండుగ సందర్బంగా మజీదులు, బస్తీలు, గ్రామాల్లో ఇఫ్తార్ విందులు, ప్రేత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయని ఈ ప్రాంతాల్లో, ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వీధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈద్ఘాలు, మజీదులు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అసౌకర్యం లేకుండా తగిన పనులు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పండుగ రోజు ప్రార్ధనలు (ఈద్ఘాలు) వద్ద త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనీ, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పండుగ ఉత్సవాలు ప్రశాంతగా జరిగేలా చర్యలు తీసుకోవాల ఆదేశించారు.