calender_icon.png 30 September, 2024 | 6:53 AM

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

29-09-2024 02:24:15 AM

సంగారెడ్డి జిల్లాలో 1,49,370 ఎకరాల్లో వరిసాగు 

37,342 టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం

రూ.500 బోనస్‌పై రైతన్నల గంపెడాశలు

సంగారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) :  వానాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు కలుగుతుందని అధికారులు రైతుల ద్వారా సమా చారం తెలుసుకుం టున్నారు.

ఈ క్రమంలో సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఇటీవల వ్యవసాయ, మార్కెటింగ్ , పోలీసు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. సంగారెడ్డి జిల్లాలో 1,49,370 ఎకరాల్లో వరి పంట సాగులో ఉందని, దాదాపు 37,342.50 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

కాగా రాష్ట్ర ప్రభు త్వం సూపర్ ఫైన్ రకానికి క్వింటాల్‌కు రూ.2,320, కామ న్ వెరైటీకి రూ.2,300 మద్దతు ధరను ప్రకటించిన విష యం తెలిసిందే. సన్న వరి ధాన్యంకు క్వింటాల్‌కు రూ.500 అదనంగా చెల్లిస్తుందనే ప్రభుత్వ అదేశాలపై రైతన్నలు గంపెడాశలు పెట్టుకున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద మౌలిక సదుపాయలు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అధికంగా పటాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తారు. రాష్ట్ర ప్రభు త్వం గతేడాది జిల్లాలో 198 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.