calender_icon.png 23 November, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహిరంగ విచారణకు ఏర్పాట్లు పూర్తి

23-11-2024 12:04:46 AM

డీఆర్‌వో వెంకటాచారి 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22(విజయక్రాంతి): రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో బీసీల స్థితిగతులపై శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న బహిరంగ విచారణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో) వెంకటాచారి తెలిపారు.

బహిరంగ విచారణ నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, రిజిస్ట్రేషన్, సెక్రటేరియల్, వ్యాలిడేషన్, నోటరీడెస్క్ బృందాలతో శుక్రవారం వెంకటాచారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కొనసాగే బహిరంగ విచారణకు సంబంధించి ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగే సమావస్త్రశంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా టీం లీడర్లు, సిబ్బంది పనిచేయాలని.. అలాగే కార్యక్రమాన్ని పూర్తిగా రికార్డు చేయాలని సూచించారు. సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు.. బాలలక్ష్మి, సురేందర్, రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్ పాల్గొంటారని తెలిపారు.

సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకులు జి.ఆశన్న, డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అనంతం, డీపీఆర్‌వో అబ్దుల్ కలీం, కలెక్టరేట్ ఏవో సదానందం, అధికారులు నర్సింహులు, హెచ్‌డబ్ల్యూవోలు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.