ఆదిలాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ఈ నెల 28న కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతో కలిసి శుక్రవారం జాతర ఏర్పాట్లను కలెక్టర్ రాజరిషా పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమనయంతో పనిచేసి జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అన్నారు.