calender_icon.png 1 January, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతీ మాత జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు

29-12-2024 04:40:16 PM

గిరిజనుల జాతరకు కమిటీ ఎన్నిక... 

జహీరాబాద్: మోతీ మాత జాతర ఉత్సవాలు (Moti Mata Fair) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆదివారం మొగుడంపల్లి మండలంలోని ఉప్పరపల్లి తాండ లో ఉన్న మోతీ మాత దేవాలయం వద్ద గిరిజన నాయకులు సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష చేశారు. జనవరిలో జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులు తీర్మానం చేశారు. జనవరి 12, 13న మోతిమాత జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు గిరిజనులు భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని తీర్మానం చేశారు. జాతర ఉత్సవాలకు గౌరవ అధ్యక్షులుగా కిషన్ రావు పవార్, ఆలయ కమిటీ అధ్యక్షులుగా కేషు సింగ్ రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా పవన్ రాథోడ్, అసోసియేట్ అధ్యక్షులుగా శంకర్ పవార్, ఉపాధ్యక్షులుగా నారాయణ జాదవ్ లను ఎన్నిక చేశారు. వీరిని గిరిజన ఉద్యోగులు ఘనంగా సన్మానం చేశారు.