calender_icon.png 27 February, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

27-02-2025 01:50:37 AM

పిట్లం ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి):  మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పిట్లం తా హసిల్దార్ వేణుగోపాల్ తెలిపారు. 536 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల  కేంద్రంలో ఎన్నికలలో ఓటింగ్ విధులను నిర్వహించడానికి ఒక్కో బూత్ ల వారిగా  పిఒ,  ఏపీఓ, ఓపిఓ,లుగా  సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ,

ఓట్లు వేయడానికి రెండు బూతులు ఏర్పాటు చేయబడ్డాయని, మొదటి బూత్ (నెం. 112) ఉపాధ్యాయుల ఓట్ల కొరకు, రెండవ బూత్ (నెం. 167) పట్టభద్రుల ఓట్ల కొరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని పోలింగ్ బూత్లో 49 మంది ఉపాధ్యాయ ఓటర్లు , 487 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు.  ఓటింగ్ రోజున ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయని తెలిపారు,  ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరీంనగర్ కలెక్టరేట్లో ఓటర్ల వివరాలు సబ్మిట్ చేయవలసి ఉంటుందని  తాహాసిల్దార్ వేణుగోపాల్ తెలిపారు.