17-02-2025 07:12:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి భద్రపరిచే గది పరిశీలించి ఏర్పాట్లపై అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్న కళ్యాణి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.