calender_icon.png 21 January, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు

21-01-2025 12:05:44 AM

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): వచ్చే నెల 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పకడ్బందీగా ప్రాక్టికల్స్‌ను నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నారు. పరీక్షా కేంద్రాల్లోని ల్యాబ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశించింది.

ప్రాక్టికల్స్ నిర్వహణకు కాలేజీల్లో ఎలాంటి వసతులున్నా యో తెలుపుతూ డిక్లరేషన్ కూడా సమర్పించాలని జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లిష్‌కు సైతం ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండటంతో ప్రతి కళాశాలలో ఇంగ్లిష్ ఫ్యాకల్టీ వివరాలు, డిక్లరేషన్‌ను పొందుపర్చాలని తెలిపారు.  ఈ ఏడా ది 3.80 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు.