భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలోని 39 కేంద్రాల్లో జరుగుతాయని, మొత్తం 13,478 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, బ్యాగులు నిషేధమని చెప్పారు. బయోమెట్రిక్ విధానం కారణంగా మెహందీ, టాటూలు పెట్టకుండా ఉండాలని సూచించారు.