హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో హై స్కూల్ క్రీడా మైదానంలో 19న నిర్వహించే బాల బాలికల కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సెక్రెటరీ మల్లేష్ గౌడ్ తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 16 సంవత్సరాల వయసు ఉండి 55 కేజీల లోపు బరువు ఉండాలన్నారు. పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ఆధార్ కార్డు తీసుకొనిరావాలని తెలిపారు. సీనియర్ క్రీడాకారులు కబడ్డీ పోటీలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమిత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ నీరటి రమేష్, హుజురాబాద్ క్లబ్ సెక్రటరీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రవీందర్, దామోదర్, అనిల్ వర్మ, శ్రీనివాస్ పాల్గొన్నారు.