calender_icon.png 23 February, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

22-02-2025 06:39:58 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): 2024-25 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 23న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Local Social Welfare Gurukul School), కళాశాల హుజూర్నగర్ లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ దున్న వెంకటేశ్వర్లు(Principal Dunna Venkateswarlu) శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. దాదాపు 500 మంది విద్యార్థులను తమ పరీక్షా కేంద్రానికి కేటాయించినట్లు వివరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులను గంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని తెలియజేశారు. పరీక్ష రాసే విద్యార్థులు ప్యాడ్,బాల్ పాయింట్ పెన్,హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకొని రావాలన్నారు.ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష ఉంటుందని, పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నట్లు వివరించారు.