20-03-2025 09:01:03 PM
మండల విద్యాధికారి సత్యనారాయణరావు...
కొల్చారం (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎంఈవో సత్యనారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. మండల కేంద్రంలోని కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 179 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొల్చారంలో 116 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (వివోసి) రంగంపేటలో 200 మంది విద్యార్థులు, ప్రాథమిక పాఠశాల రంగంపేటలో 100 మంది విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం గం.9.30ని.ల నుండి గం.12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షలు జరిగే సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.