20-03-2025 05:54:19 PM
ఎంఈఓ హేలన్ డారతి..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎంఈఓ హేలన్ డారతి అన్నారు. గురువారం మండలంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకై 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడమైనదని ఎంఈఓ హెలెన్ డారతి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఈఓ తెలంగాణ భారతి మాట్లాడుతూ... జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్, ట్రినిటీ హైస్కూల్, టీఎస్ డబ్ల్యూ ఆర్ ఐ ఈ ఎస్ హైస్కూల్, జెడ్ పి హెచ్ ఎస్ గర్ల్స్ లో 200 మంది, ట్రినిటీ హైస్కూల్లో 194 మంది, టీఎస్ డబ్ల్యూ ఆర్ ఐ ఈ ఎస్ గర్ల్స్ లో 220 మంది అలాట్ చేయడం జరిగిందన్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.