calender_icon.png 18 November, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : ప్రిన్సిపాల్ వాణి

09-11-2024 08:22:18 PM

నడిగూడెం,(విజయక్రాంతి): ఈనెల 11 నుంచి 14 వరకు  పదవ జోనల్ స్థాయి స్పోర్ట్స్ స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ వాణి పేర్కొన్నారు. శనివారం పేరెంట్స్ కూడా క్రీడల నిర్వహణకు సంబంధించి ఆట స్థలాన్ని తదితరు ఏర్పాట్లను  తాసిల్దార్ సరిత, ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఆర్ ఐ గోపాలకృష్ణ  పరిశీలించారు. క్రీడల నిర్వహణకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలోని గురుకుల పాఠశాలల విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటారని తెలిపారు.  వాలీబాల్, కబడ్డీ, కోకో తదితర పోటీలతోపాటు స్పోర్ట్స్ కూడా నిర్వహించనున్నారు. 9 పాఠశాలల నుండి 765 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారు. ఈ మేరకు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఎన్. కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తదితరులు జోనల్ మీట్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అందరికీ ఆహ్వానాలను పంపినట్లు తెలిపారు.  ఈనెల 14న క్రీడల ముగింపు ఉంటుందని ఆమె తెలిపారు.