calender_icon.png 22 January, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు

03-07-2024 12:43:18 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాం తి): ప్రభుత్వం నిర్వహించే వనమహోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై మొదటి వారంలో  నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను క్రలుపుకుని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయాలని పేర్కొంది. నర్సరీలలో పూర్తి స్థాయిలో గ్రేడింగ్ చేసిన తర్వాతే మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాలని పేర్కొంది. ఫలాలను ఇచ్చే జాతులను  నాటడంపై ప్రత్యేక దృష్టి సారించాలంది. అవసరం అయితే మొక్కల రక్షణ కోసం ప్రత్యేకంగా గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది.