కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జగద్గురు నరేంద్ర చార్య రత్నగిరి మహారాజ్ పాదుకల దర్శన ఏర్పాట్లు నిర్వాహకులు పూర్తి చేశారు. జిల్లా కేంద్రానికి చేరిన పాదుకలు పట్టణంలోని తాటి పెళ్లి దిలీప్ నివాసంలో గురువారం ప్రత్యేక పూజలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ పక్కన శుక్రవారం ఉదయం 9 గంటలకు గురూజీ పాదుక ప్రదర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సనాతన, హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేసే దిశలో ప్రజలందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.