calender_icon.png 5 December, 2024 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ సిబ్బంది కొరకు క్వార్టర్ ఏర్పాటు

04-12-2024 11:31:37 PM

ఎమ్మెల్సీ దండే విఠల్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అటవీ సిబ్బంది కొరకు క్వార్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా బుధవారం అటవీ శాఖ కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్ ఫ్రంట్ లైన్ సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన క్వార్టర్ ను జిల్లా అటవీ అధికారి నీరజ్ టేబ్రివాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా శాసన మండలి సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అటవీ శాఖ సిబ్బంది సంక్షేమం కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.