calender_icon.png 1 November, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ ఆరోగ్యశ్రీ

17-07-2024 04:13:17 AM

  • రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు 
  • కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, జులై 16 (విజయక్రాంతి): ఆరోగ్యశ్రీపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రాష్ర్టంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ర్టంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.

ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాల న్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ పడకకు ఒక సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు.