జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఒక ఆర్మీ జవాన్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు. హవల్దార్ ఇందేశ్ కుమార్ మంజకోట్ ప్రాంతంలోని అంజన్‌వాలి గ్రామంలోని తన క్యాంపులో సెంట్రీ డ్యూటీలో ఉండగా మంగళవారం అర్థరాత్రి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదని వారు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.